అంతము లేని ప్రేమ యేసు ప్రేమ

జోసెఫ్ అవినాష్
05 Dec 2025
ఆగమనకాల 1వ శనివారం
యెషయా 30:19-21,23-26
కీర్తన 147:1-6
మత్తయి 9:35-10;1,6-8
ధ్యానం:హెచ్చరికలు :
మన అనుదిన జీవితంలో “హెచ్చరికలు” స్పష్టమైన సందేశాన్ని తెలియజేస్తాయి.ఉదాహరణకు ప్రయాణపు హెచ్చరికలు రోడ్డుపై నడవవలసిన తీరును నేర్పిస్తాయి వాతావరణ హెచ్చరికలు రానున్న అవంతారాల నుంచి సుఃఖ ప్రదేశాలలో తలదాయుకొవడం నేర్పిస్తాయి.నేటి మొదటి పాఠంలో ఆకరి పదం హెచ్చరించుట.యెరుషలేము వాసులు ప్రభువుపై నమ్మకాన్ని ఉంచిన,ప్రభు సహాయమును ప్రత్యేక్షంగా పొందగలరు. అదేవిధంగా క్రీస్తు పన్నెద్దరు శిష్యులను పిలవటం,పంపటం వారు తీసుకొని వలసిన జాగ్రత్తల గురించి హెచ్చరించి ఆశ్వీర్వదించి పంపుతూన్నారు.
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు -:
నీవు కుండపోతగా వాన కురియించి నేలదుక్కులు తడుపుదువు.మట్టి పెళ్ళలను కరిగించి చదును చేయుదువు.జల్లులతో మట్టిని నానింతువు.ఆ మట్టి నుండి మొలచిన మొలకలకు పెంపును ఒసగుదువు.
యేసు తన శిష్యులకు హెచ్చరికలతో పాటు ప్రజల జీవితాలను మార్చే దైవ అనుగ్రహమును,స్వస్థత వరములను దయాచేశారు.సామాన్య శిష్యులను అసామాన్య వీరులుగా తిర్చిదిద్దుతున్నారు.అంతము లేని ప్రేమ యేసు ప్రేమ.
