శాంతి,ఐక్యతే ప్రపంచానికి మార్గం -పోప్

జోసెఫ్ అవినాష్

04 Dec 2025

యుద్ధాలు,ద్వేషం ప్రపంచాన్ని నాశనం చేస్తున్న ఈ సమయంలో సంవాదం,కరుణ,శాంతి మాత్రమే భవిష్యత్తుకు మార్గమని పోప్ లియో XIV స్పష్టం చేశారు.టర్కీ–లెబనాన్ అపోస్టలిక పర్యటన ముగింపు అనంతరం విమానంలో మీడియాతో మాట్లాడిన పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇజ్రాయెల్–పాలస్తీనా సంఘర్షణపై ఆయన మాట్లాడుతూ,ఈ వివాదానికి రెండు దేశాల సిద్ధాంతమే (Two-State Solution) ఏకైక మార్గమని పోప్ స్పష్టం చేశారు. హింసతో శాశ్వత పరిష్కారం సాధ్యంకాదని చెప్పారు.నైసియ1700వ వార్షికోత్సవం సందర్భంగా క్రైస్తవుల ఐక్యత ఎంత ముఖ్యమో ప్రపంచానికి గుర్తు చేయడమే తన పర్యటన ముఖ్య లక్ష్యమని పోప్ అన్నారు.క్రైస్తవులు విభేదాలను వీడి ఐక్యతతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.పోప్‌గా బాధ్యత తీసుకోవడం దేవుడి చిత్తానికి లొంగిపోవడమేనని చెప్పారు.ఇది తన వ్యక్తిగత ఆశయమేమీ కాదని,దేవుని పిలుపుగా స్వీకరించానని తెలిపారు.

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN