క్రీస్తు జయంతి జూబిలీ వాక్కు

Father B.INNA
04 Dec 2025
"మొక్క ఏపుగా ఎదుగుటకు వేర్లు లోతుగా వెళ్లాలి కదా! విశ్వాసి దృఢంగా ఉండుటకు దేవునిలో లోతుగా జీవించాలి. నిరీక్షణ యాత్రికులు, ఏపుగా ఎదగడమే అందరికీ కనిపిస్తుంది కదా అని ఆడంబరాల జీవితాన్ని కోరుకోరాదు,కనిపించకుండానే లోతుకు పాతుకుని పోయిన వేర్లు ఎలాగో, నిరీక్షణ యాత్రికుల విశ్వాసం అలాగే లోతుగా ఉండాలి. క్రీస్తులో మనం దృఢంగా ఉంటేనే, బయటికి కనిపించే జీవితం అందంగా ఉంటుంది. ఆశీర్వాదకరంగా ఉంటుంది."
