ఆగమన ప్రకటన

ఫాదర్ కుమ్మరి అలెగ్జాండర్

03 Dec 2025

ఆగమన ప్రకటన
విన్నావా మిత్రమా!
ఆగమన ప్రకటన!
అత్యున్నతుని మౌన
సంభాషణ!
నిశ్శబ్దపు పలుకులు గుసగుసలై
దిగాంతాలకు తరంగాలుగా
వ్యాపించే వైనము

విన్నావా మిత్రమా!
ఆగమన ప్రకటన!
నిశ్చలమైంది, నిశ్చష్ఠ
అయ్యింది కాలం
స్వర్గ లోకపు ద్వారం
నుండి కెరు భిమ్
దూత ప్రయాణం
విప్పారిన తెల్లని
రెక్కలను విస్మరతి0తో
పరికిస్తున్న ఓ
హెబ్రీయ బాలిక!
సముద్రం ఉప్పొంగి,
ఆగి, స్థానువై మళ్లీ పొంగింది!
వినమ్రంగా కాళ్లుని,
చేతులు జోడించింది ఆ బాలిక!
ఊర్డ్వా లోకం నుండి
ప్రసరించిన ఓ శ్వేతాగ్ని జ్వాల...
ఆమె హృదయాన్ని ఆవరించింది
విన్నావా మిత్రమా!
ఆగమన ప్రకటన!
సంబ్రమాశ్చర్యాలతో
ముప్పిడి కొని ఆకాశం
వైపు చూసింది
మరలా ఈ భూ ప్రపంచం
యధాస్థితికి వచ్చింది
వసంత కాలపు తొలి
రోజుల ఆమె హృదయంలో
ఉదయించగా
ఆనంద ఘడియలు
సెలయేరు లై ప్రవహించసాగాయి
అంత ,ఆమె కళ్ళల్లో
కోటి కాంతులు మెరిసాయి
విన్నావా మిత్రమా!
ఆగమన ప్రకటన

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN