యేసు మన పునాది,కోట

ఫాదర్ గోపు ప్రవీణ్

03 Dec 2025

గురువారం,ఆగమన కాల మొదటి వారము
యెషయా 26:1-6;
మత్తయి 7:21, 24-27
ధ్యానాంశము: యేసు మన పునాది, కోట
ధ్యానమునకు ఉపకరించు వాక్యములు: “పరలోక మందలి నా తండ్రి చిత్తానుసారముగా వర్తించువాడే పరలోక రాజ్యమున ప్రవేశించును” (మత్తయి 7:21).

ధ్యానము: ఎలాగైతే యిల్లును రాతి పునాదిపై కట్టుకుంటామో, మన ఆధ్యాత్మిక జీవితాన్ని యేసు అను రాతిపై నిర్మించుకోవాలి. ఎన్ని శోధనలు, శ్రమలు, హింసలు, అవమానములు, బాధలు వచ్చినను, మన ఆధ్యాత్మిక జీవితాలు కూలిపోవు. యేసు అను రాతి అనగా ఆయన బోధనలు, ఆయన జీవితం, ఆయన ఆదర్శం. యేసు బోధనలను ఆలకించి పాటించాలి (7:24), అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితాలు, గృహాలు దృఢముగా, పదిలంగా ఉంటాయి. "ప్రభూ! ప్రభూ! అని నన్ను సంబోధించు ప్రతివాడును పరలోక రాజ్యములో ప్రవేశింపడు" అని యేసు గుర్తుకు చేస్తున్నారు. దేవుని చిత్తమును నెరవేర్చాలి. కనుక, యేసు మాటలను వినుట, వాటిని ఆచరించుట మన జీవితాలకు పునాది అని అర్ధమగుచున్నది. దేవునితో మన బంధం బలపడాలంటే, యేసు అను రాతిపై పునాదిని నిర్మించుకోవాలి. అభద్రతాభావముతోగాక, దేవునియందు భద్రతాభావముతో జీవించాలి. యేసునందు సంపూర్ణ నమ్మకాన్ని ఉంచినచో రాతి అయిన యేసు మన కోటగా మారును. అప్పుడు ఏ శక్తులు మనలను విచ్చిన్నం చేయలేవు.

క్రీస్తును రాయిగా, కోటగా అంగీకరిస్తున్నామా? దేవుని చిత్తాన్ని వెతకుచున్నామా? యేసు మాటలను పాటిస్తున్నామా?

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN