యువతే శ్రీసభ భవిష్యత్తు -పోప్

జోసెఫ్ అవినాష్
22 Nov 2025
టెక్నాలజీ,కృత్రిమ మేధా అనేవి మన విశ్వాసానికి సహాయకంగా ఉండాలి కానీ మనం బలవంతంగా వాటి మీద ఆధారపడి జీవించకూడదని,ఒకనాడు అవి నిలిచిపోతే మనం స్వయంగా ఆలోచించుకోగలిగే సామర్థ్యం కలిగి ఉండాలని నేషనల్ క్యాథలిక్ యూత్ కాన్ఫరెన్స్ వారు నిర్వహించిన ఆన్లైన్ సమావేశంలో సమావేశమైన పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు.పాపము చేసినా పశ్చాత్తాపడి దేవునితో కలిసి జీవించడం ద్వారా,దేవుని కృపను మనం తిరిగి పొందుకోవచ్చునని,దేవుడు మన హృదయ ద్వారాలు తెరిచి అందులోకి రావాలని ఆశపడుతున్నారని,యువత లోక మాయలో పడకుండా,దేవునికి దగ్గరగా జీవించాలని ఆయన కోరారు.ఈ ఆన్లైన్ సమావేశంలో సుమారు 13 వేల మంది యువత పాల్గొన్నట్లు వాటికన్ ఒక ప్రకటనలో తెలిపింది.
