పునీత సెశీల్యమ్మ స్మరణ

ఫాదర్ ఎన్. సురేందర్
21 Nov 2025
ఉపోద్ఘాతం:
రోమన్ కన్యక, సంగీత కళాకారులు, గాయకులు, సంగీత సాధనాల తయారీదారుల, కవుల పాలకు పునీతురాలు, వేదసాక్షి
క్రైస్తవ వ్యతిరేక అలెగ్జాండర్ సేవేరస్ చక్రవర్తి పాలనలో క్రైస్తవ కన్యత్వపు మరియు వేదసాక్షి పూరిత సువాసనల గుబాలింపు లను లోకానికి వెదజల్లిన ఒక అందమైన పుష్పం ముగ్ధ మనోహర కన్యక పునీత సెశీల్యమ్మ గారు. ధనిక కుటుంబంలో ఈమె జన్మించారు .తను ఒక్కరే వారి ఇంట్లో రోషం కలిగిన క్రైస్తవురాలు. దానధర్మాలతో, జపతప ప్రార్థనలతో అనుదిన జీవితాన్ని పరమార్ధం చేసుకునేది. పు. సెశీల్యమ్మ గారు దివ్య పూజ అర్చన కాండలో పేర్కొన ఏడుగురు పవిత్ర హతసాక్షుల జాబితాలో వీరిని కూడా ఒకటి
పునీత సెశీల్యమ్మ గారి మూడు అసాధారణ ప్రత్యేకతలు
1.పునీత సెశీల్యమ్మ గారు విశ్వాస వీరవనిత:
దేవుడు తనకు సమకూర్చిన కావలి దూతను భౌతికంగా కళ్ళారా చూసే ఆత్మీయ జీవితం ఆమె సొంతం. విశ్వాస ఉన్నత శిఖరాలను అధిరోహించిన ఒక ఆత్మీయ పర్వతరోహకురలు ఈమె. తన అమోఘ విశ్వాసమే ఆమెను హతసాక్షి మరణం వైపునకు నడిపించింది. తాను మాత్రమే కాదు ఆ భర్త వలేరియస్ను, వలేరియస్ తమ్ముణ్ణి కూడా విశ్వాస జీవితంలో బలోపేతం చేసి ,వారిని కూడా హతసాక్షి మరణం మహిమ వైపునకు అడుగులు వేయించి సఫలీకృతురాలయింది. పునీత సెశీల్యమ్మ గారు తన పెండ్లి తంతు జరుగుతుండగా తనను తాను పూర్తిగా, తన కన్యత్వాన్ని క్రీస్తుకు అంకితం చేసుకుంటూ, మౌన ప్రార్థన చేసింది. తను ఎప్పుడు తన ప్రియుడైన క్రీస్తును నా ప్రియుడు వాడు, నేను అతని దాసిని అంటూ క్రీస్తుకు సమర్పించుకుంటూ ఉండేది. ఆమె ఎంతటి విశ్వాసురాలు!!
2. మహిమాన్విత వేదసాక్షి మరణం
పునీత సెశీల్యమ్మ గారి మరణం కూడా ఆశ్చర్యకంగా మహిమ కరంగా జరిగింది .క్రైస్తవ విరోధులు ఆమెకు మరణశిక్షణ విధించగా ,మరణశిక్షను అమలుపరిచే విధానంలో మూడు రకాలైన శిక్షలను పొందింది. వాటిలో రెండింటిని పూర్తిగా అధిగమించింది .
మొదటిది: పునీత సెశీల్యమ్మను ఒక గదిలో బంధించి దానిలోకి వేడి ఆవిరి గాలిని పంపించడం ద్వారా చంపాలనుకున్నారు. ఆ విధానంలో ఆమె మరణించలేదు.
రెండవ విధానం:
సాధారణం కంటే ఏడుసార్లు అధికంగా వేడి చేసిన నీటిలో ఆమెను పడవేయగా, ఆమె ఆ నీళ్ల మీద చిరునవ్వులు చిందిస్తూ, తేలి ఆడబడింది. కానీ మరణం ఆమెను హరించలేదు. ఈ విధానం కూడా విఫలమైంది.
మూడవది: అప్పటికి విసిగిపోయిన అధికారులు ఆనాటి నియమం ప్రకారం మూడు కత్తిగాట్లు చేసి, తలను నరకాలనుకున్నారు .అలాగా మూడుసార్లు కత్తి వేటు వేసిన కూడా ఆమె మరణించలేదు. మెడ సగం మాత్రమే నరకబడగా, రెండు పగళ్ళు, రెండు రాత్రులు పూర్తిగా రక్తపు మడుగులో ఉండి క్రీస్తును స్తుతించింది. క్రీస్తు కొరకైన నా బాధలు నాకు ఆనందమే గాని బాధను కలిగింపదు అంటూ మరణ మృదంగాన్ని మహిమ మృదంగం స్తుతించింది .తన పరమ పరలోక ప్రియుడైన యేసు ను చేరడానికై సిద్ధం చేయబడిన హతసాక్షి కిరీటాన్ని అందుకుంది.
3.పునీత సెశీల్యమ్మ శిథిల రహిత మృతదేహం:
పునీత సెశీల్యమ్మ గారు రెండు రోజులు రక్తక మడుగులో ఉన్నప్పుడు అప్పటి పాపు గారే ఆమెకు అవస్థ అభ్యాంగం ఇవ్వడం, మరణించాక భూస్థాపిత సాంగ్యని నిర్వర్తించటం గమనార్హం .హతసాక్షులుగా మరణించిన పాపు గార్లు, పీఠాధిపతుల సమాధుల తోటలో ఆమెను పూడ్చి పెట్టడం ఆమె ధన్య మరణానికి ప్రతీక .ఆమె ఏ స్థితిలో మరణించిందో అదే స్థితిలో ఆమెను ఖననం చేశారు .అయితే మరణించిన రోజు నుండే ప్రజలు క్రైస్తవ విశ్వాసుల ద్వారా పునీతులుగా కీర్తింపబడ్డారు. ఆశ్చర్యం ఏమిటంటే క్రీస్తు శకం 1599లో పునీత సెశీల్యమ్మ గారి సమాధిని తెరువగా ఆమె మృతదేహం శిథిల రహితంగా ఉండటం దేవుడు ఆమెకు ఇచ్చిన మహిమ అని మనం అర్థం చేసుకోవచ్చు.
ముగింపు:
పాటే స్వరం, పాటే స్వర్గం, పాటే అంతం
పునీత సెశీల్యమ్మ గారు విద్యాబుద్ధులతో పాటు సంగీతం కూడా నేర్చుకుంది. తన గానంతో, సంగీతంతో తన ప్రాణ ప్రియుడైన క్రీస్తును ఘాడమైన ప్రేమానురాగాలతో ,ప్రగాఢమైన విశ్వాసంతో స్తుతిస్తూ, విహరించేది .ఆధ్యాత్మికం చెందేది .రెండు రోజుల రక్తపు మడుగులో ప్రాణాలతో, కొట్టుమిట్టాడిన రక్తపు ధారలతో సప్త స్వరాల మౌనరాగంతో ఆత్మ రాగాన్ని ఆలపించింది. ఆ సందర్భంలో దేవదూతలు వీణలు వాయిస్తూ,పునీత సెశీల్యమ్మ గారితో గొంతు కలపటం ఎంత దివ్యానుభూతి మన దైవార్చనలో కూడా పునీత సెశీల్యమ్మ వలె ప్రభుని ఆరాధిద్దాం. ఈ వరానికై సంగీత కళాకారుల పోషకురాలు పునీత సెశీల్యమ్మ గారి విజ్ఞాపనను కోరుకుందాం.
