"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

08 Nov 2025

తే.గీ:
ఈ శరీరమ్ము నీ కొరకే! మరొక్క
ఐహికము బాహ్య దేహార్థ మౌనె యరయ!
ఇదియె పంచేంద్రియాలయ మ్మిదియ నీ ని
వాస గృహమై చరించుతన్ వసుధ యందు!

భావం :
ప్రభూ ! ఈ దేహం సంపూర్ణంగా నీకు సమర్పితం.ఈ పంచేంద్రియ దేవాలయం నీ నివాసం కోసమే.నీవు ఇందులో నివసిస్తూ ఉండగా సంచరించే దేవాలయంలా నేను ఈ నేలపై తిరుగాడుతూ నిన్ను ప్రకటిస్తూ ఉంటనే తప్ప,దీన్నో వ్యాపార కేంద్రంలా చేయకుందును గాక!!
(యోహాను 2:13- 22)

( ఎలా ఐతే అలనాడు జెరూషలేము దేవాలయం ఎడ్లకు , గొర్రెలకూ పావురాల అమ్మకాలకు కొనుగోళ్ళకూ వ్యాపార కేంద్రంగా ఉంటూ స్వార్థ సంకుచిత బాహ్య బుద్ధితో నిండి పోయి , నీ పవిత్రతకు భంగం కలిగించిందో అలానే , ఈ ,నా శరీర దేవాలయాన్ని తయారు కాకుండా రక్షించుమయ్యా !! )

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN