నవంబర్ నెల ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించిన పోప్
జోసెఫ్ అవినాష్
05 Nov 2025
జగద్గురువులు పోప్ లియో XIV ,నవంబర్లో మనం ప్రార్థించాల్సిన ప్రార్థనా ఉద్దేశాన్ని ప్రకటించారు.క్షణికావేశంలో ఎంతో మంది తమ జీవితాలను ఆత్మహత్యల రూపంలో ముగిస్తారని,ఆత్మహత్య ఆలోచనలు ఎదుర్కొంటున్నవారిని వారికి అవసరమైన మద్దతు,సంరక్షణ, ప్రేమ అందించగల సమాజాన్ని వారు కనుగొనగలరని ప్రార్థించాలని ఆయన కోరారు.జీవితం దేవుడిచ్చిన అందమైన బహుమతి అని శ్రమలను,బాధలను చూసి భయపడకుండా వాటిని క్రీస్తుకు సమర్పిస్తూ, ధైర్యంగా జీవించాలని ఆయన అంతర్జాతీయ సమాజాన్ని కోరారు.
