"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

05 Nov 2025

తే.గీ :
సర్వ సంగ పరిత్యాగి గర్వ హీను
లై స్వ పుత్ర మిత్రులు భ్రాత్రులన్ త్యజించి
స్వీయ సంపాద్యముల నెల్ల విడిచి పెట్టి
ఎవ్వడైతే యనుసరించ నిష్ట పడునొ ,
స్వీయ శిలువ భారమ్ములన్ మోయ గలడొ
వాడె నా శిష్య రత్నమౌ చూడ చూడ

భావం :
నా శిష్యునిగా ఉండాలని కోరుకుంటే ముందుగా మీ చుట్టూ అంటి పెట్టుకున్న వాటన్నిటినీ విడనాడాలి. (సర్వ సంగ పరిత్యాజ్యం ) భార్యా బిడ్డలు , అన్నదమ్ములూ , బంధు మిత్రులు సర్వ సంపదలూ ఇవన్నీ మానవుడ్ని అంటి పెట్టు కున్న పాశాలు . వీటిని విడిస్తే , తాను కనిపిస్తాడని, తన పరి చర్య కూడా కనిపిస్తుందనేది ప్రభుని బోధ!
(లూకా 14:25-33)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN