వినూత్న రీతిలో మరియమాత దర్శనాల ప్రదర్శన

జోసెఫ్ అవినాష్
04 Nov 2025
జపమాల అంకిత మాసం ముగింపు సందర్భంగా అక్టోబర్ 30న ఖతార్‌లోని సెయింట్ థామస్ సిరో-మలబార్ చర్చి “మరియదీప్తి” (మరియ వెలుగు) అనే వేడుకను జరిపింది.ఈ వేడుకలో మరియమాత విశ్వవ్యాప్తంగా ఇచ్చిన దర్శనాలను,చిన్న బిడ్డలు ఆ తల్లి వేషధారణలో చక్కగా ప్రదర్శించారు.వాటికన్ ఆమోదించిన మరియమాత బిరుదు నామాల సమూహారంగా రూపొందించిన ఈ ప్రదర్శన మరియతల్లి పట్ల ప్రేమను,గౌరవాన్ని కలిగించే విధంగా నిలిచింది.ఈ వేడుకలో ఫా. జోయ్‌సన్ ఐడసెరీ OFM Cap,ఫా. బిజు మాధవత్, ఫా. థామస్ పొరియత్, ఫా. జోయెల్, ఫా. మైకేల్ లు పాల్గొన్నారు.
