అంతోని వారు -బాలయేసు!

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి

04 Nov 2025

అంతోని వారు -బాలయేసు!
************************
అది ఇటలీ దేశం లోని పాదువా పట్టణం.ఆ పట్టణ దరి దాపుల్లో "కంపోసం పియరో "అనే ఊరు ఉండేది. ఆ ఊళ్ళో స్థానిక పాలకుడైన "టీసో" ప్రభువు నివాస గృహం ఉండేది. ఆ నివాస గృహానికి ఒక వైపున ఒక ఆశ్రమం ఉండేది.

ఒక రోజు, ఆ ఆశ్రమం గది తలుపులు బంధించ బడి ఉండగా, మూసి ఉన్న ఆ తలుపుల్లోంచి దివ్య కాంతి పుంజాలు వెలుపలికి ప్రసరిస్తూ ఉన్నాయంట. లోపల ఏ మహాత్మ్యం జరుగుతున్నదో ఏమో మరి!

అప్పుడే అటుగా వచ్చిన "టీసో "ప్రభువు ఆ తలుపు సందుల గుండా లోనికి తొంగి చూసి విభ్రమానికి గురయ్యాడట. లోపల టీసో ప్రభవు ఆహ్వానం మేరకు వచ్చి ఆశ్రమంలో విశ్రాంతి తీసుకుంటున్న పాదువా పుర స్వామి అంతోని వారున్నారట. అందులో ఆశ్చర్య పడాల్సింది ఏమీ లేదు కానీ, ఆ స్వామి చంకన కోటి సూర్యా ప్రభాకలితుడై భాసించే ముద్దుల బాలుడైన బాల యేసువు, ఆ నాడు మరియ తల్లి ఒడిలో ముద్దులు గుడిచిన చందాన అంతోని వారి ప్రేమ పన్నీట జలకాలాడుతూ, బోసి నవ్వుల పువ్వులు విరియిస్తున్నాడంట.

ఆ విధంగా అంతోని వారికి ఆతిధ్య మిచ్చిన పుణ్య ఫలాన, బాల యేసుని కళ్లారా చూసిన తన జన్మ ధన్యమయిందని భావించాడట టీసో ప్రభువు ఆ నాడు.

మరి తలచినంతనే బాలస్వామిని ఇలకు రప్పించుకుని ముద్దులు కురిపించి మెప్పించగల అంతోని వారి జన్మ ఇంకెంత ధన్యమో గదా!

ఆ. వె :
బుజ్జి బాల యేసు భుజ మెక్కికూర్చుండ
ముద్దులన్ని పెట్టి సుద్దు లాడి
అమ్మ మరియ వోలె ఆడించి నావయ్య,
పాదువ పుర స్వామి ప్రణతి సేతు .

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN