"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
03 Nov 2025
తే.గీ:
నీ సువార్తనే రుచిచూడ నిను స్మరించు
భాగ్య మింతైన మా కివ్వు పరమ తండ్రి !
అర్హతన్నదే లేదని అనక మమ్ము
కరుణతోడ నిన్నందగా వరము లిడవొ!!
భావం :
ప్రభూ! నీ వాక్కులో ఆనందిముటకునై మమ్ము అర్హులనుగా చేయుమయ్య!! ఆ భాగ్యానికి నోచుకునేట్టుగా మమ్ము దీవించు మ్మయ్య !ఎందుకూ పనికి రారని మమ్న్ము నెట్టి వేయక మా పై కరుణతో నీ చెంతక్జు ఆదరించుమయ్య !!
(లూకా 14:15-24)
