"దైవ రాజ్యమున భుజించువాడు ఎంత ధన్యుడు!"

జోసెఫ్ అవినాష్
03 Nov 2025
సామాన్య 31వ మంగళవారం
రోమి 12:5-16
కీర్తన 13:1-3
లూకా 14:15-24
మన కుటుంబ కార్యక్రమాలకు ఆహ్వానించిన వారు రాలేదని, ఎంతో బాధపడుతుంటాం. ముఖ్యంగా మనకు ఎంతో ఇష్టమైన వారు కావాలనే మన ఆహ్వానాన్ని నిరాకరిస్తే కోపం వస్తుంది.మనసు నిర్మలంగా ఉండదు.వారి గురించే ఆలోచిస్తుంటాం.తోటి వారు మనకు ఇచ్చే విలువను గౌరవించకపోవడం బాధాకరమే.మరో ప్రక్క రాలేకపోవడానికి బలమైన కారణాలు ఉండవచ్చు. యేసుక్రీస్తు ఇలాంటి జీవిత అనుభవాలను "విందు - పరలోక రాజ్యం” ఉపమానం ద్వారా మన నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపారు.దేవుని కృపను ఎలా కోల్పోతున్నామో గ్రహించేలా చేశారు."పరలోక రాజ్యంలో భుజించువాడు ఎంత ధన్యుడు!" కానీ ఈ విషయం అందరికీ అర్థం కాదు.ఎందుకంటే పరలోక రాజ్యపు విందుకై సిద్ధంగా లేకపోవడమే.దేవుని పిలుపును తిరస్కరించి పరలోక జీవితాన్ని కోల్పోతున్నాం.విందు సిద్ధపరచిన తర్వాత మొదట యోగ్యులను ఆహ్వానించారు. కానీ వివిధ కారణాలతో, సాకులతో యోగ్యులైన వారు విందులో పాల్గొనడానికి నిరాకరించారు.అప్పుడు అయోగ్యులుగా ఉన్న వారిని విందుకు ఆహ్వానించారు. ఆహ్వానం లేని వారు ఇప్పుడు, సమృద్ధిని పొందారు.ఆధ్యాత్మిక తృష్ణ లేకపోతే,యోగ్యులమై ఉండి కూడా,ఆ భాగ్యాన్ని నోచుకోలేము. దేవుని కృపను గుర్తించకపోవడం వలన, పరలోక విందును పోగొట్టుకుంటున్నాము. అలాంటివారు,దేవుని కోపానికి పాత్రులౌతారు. దేవుని పిలుపుకై ఎదురు చూసి, ఎప్పుడు సంసిద్ధులమై ఉండాలని నేర్చుకుందాము.
