మరణించిన వారిని క్రీస్తు చేతికి అప్పగించండి - పోప్
జోసెఫ్ అవినాష్
03 Nov 2025
మరణం అంతం కాదని, అది మరో నూతన జీవితానికి ఆరంభమని నవంబర్ 2 సకల ఆత్మల పండుగ సందర్భంగా జగద్గురువులు పోప్ లియో XIV తాను అందించిన పండుగ సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.క్రీస్తు పునరుత్థానం నిత్య జీవానికి ద్వారం తెరిచిందని ఆయన తెలియపరిచారు. మరణించిన మన ఆత్మీయులను దుఃఖముతో కాక ప్రేమతో, విశ్వాసముతో స్మరించాలని, వారి పేరిట మనం చేసే ప్రార్థనలు,దానధర్మాలు వారితో మన బంధాన్ని కొనసాగిస్తాయని ఆయన తెలియపరిచారు.ప్రతి మనిషికి మరణం తధ్యమని,కానీ అది ముగింపు కాదని, అందులోనే పునరుత్థాన వాగ్దానం దాగి ఉందని, మృతులు మనతో లేకపోయినా దేవునితో ఉన్నారని విశ్వసిస్తూ,మృతులను క్రీస్తు చేతికి అప్పగిస్తూ,పునరుత్థాన క్రీస్తు వైపు మన దృష్టిని నిలపాలని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
