"నేటి వాక్పఠనం - కవన ధ్యానం"
డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
02 Nov 2025
తే.గీ:
అదివొ సాయమ్ము చేసినా నంచు,తిరిగి
దాని ప్రత్యుపకారప్రదానమునకు
ఎదురు చూడ నౌచిత్యమే? హృదయ నైచ్య
కార్యమిది కాదొ? సంఘ సత్కార్య చరిత!
భావం :
ఒక మేలు చేయడం వెనుక ఏదో ఆశించడం ఉంటే దాని లోని స్వార్థ బుద్ధి బట్టబయలౌతుంది.నిస్వార్థ సేవలోనే అసలైన ప్రేమ తత్త్వం దాగి ఉంటుంది.సంఘ నేతలారా! దాతలారా!! ఈ నిగూఢ సత్యం తెలుసుకోండి!
(లూకా 14:12-14)
