సమాచారం ఒక ప్రజా సంపద,అమ్ముకునే వస్తువు కాదు - పోప్

జోసెఫ్ అవినాష్
10 Oct 2025
పోప్ లియో XIV ప్రపంచంలోని ప్రముఖ వార్తా సంస్థల నెట్‌వర్క్‌ను ఉద్దేశించి మాట్లాడుతూ,ప్రతిరోజూ సత్యాన్ని పంచడానికి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితుల్లో సైతం నిజాయితీగా పనిచేస్తున్న పాత్రికేయులకు ధన్యవాదాలు తెలిపారు.గాజా, ఉక్రెయిన్ వంటి బాంబుల, యుద్ధ బీభత్సాన్ని మనం వారివల్లే తెలుసుకోగలిగామని ఆయన అన్నారు.గాసిప్స్, నకిలీ వార్తలు మన సమాజంలో సత్యాన్ని మసకబార్చే ప్రమాదాలని,సత్యం మరియు అబద్ధం మధ్య తేడా కనుమరుగైతే, సమాజం నాశనమవుతుందని ఆయన హెచ్చరించారు.పాత్రికేయులు నిజాయితీ,విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ, సమాజాన్ని విష వార్తల, నకిలీ సమాచారాల భారి నుండి రక్షించే కోటగా వర్ధిల్లాలని ఆయన సెలవిచ్చారు.