ప్రార్థన శక్తితో సైతానును తరిమికొడదాం

జోసెఫ్ అవినాష్
09 Oct 2025
సామాన్య 27వ శుక్రవారం
సువిశేష సందేశం
లూకా 11:15- 26
ఈనాటి సువిశేషంలో క్రీస్తుప్రభువారు మూగదయ్యములను పారద్రోలారు.ప్రస్తుత సమాజంలో దెయ్యములు ఉన్నాయా? అనే ప్రశ్న వినబడుతుంది.దయ్యములు ఉన్నాయి అంటే కొంతమంది నమ్మని పరిస్థితి.కాని బైబులు గ్రంథములో క్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భంలో దయ్యములను వదలకొట్టడం చూస్తాం.ఈనాటి సువిశేషంలో లూకా 11:14లో ప్రభువారు మూగదయ్యములను తరిమి వేశారు.
మార్కు 1:23-26 : అపవిత్రాత్మ ఆవరించిన వాడొకడు కేకలు వేయుచు నజరేతు నివాసియగు యేసు మాతో నీకేమి పని మమ్ము నాశనం చేయవచ్చితివా! నీవు ఎవరివో నేను ఎరుగుదును "నీవు దేవుని పవిత్ర మూర్తివి" అని కేకలు వేస్తారు. అందుకు క్రీస్తు ప్రభువారు వీని నుండి వెడలి పొమ్ము అనగా వెడలి పోయాయి.
మార్కు 1:39 : క్రీస్తు ప్రభువారు వేద ప్రచారంలో అనేక దయ్యములను వెళ్ళగొట్టారు. కానీ పరిసయ్యులు మాత్రం క్రీస్తు ప్రభువారు చేసిన కార్యములను, దెయ్యములకు అధిపతి అయిన బెల్జబూలు సహాయంతో ఈ కార్యములు చేస్తున్నాడు అని నిందించారు.
మార్కు 5:7-10 : దయ్యము పట్టి సమాధులలో గొలుసులతో కట్టివేయబడిన వ్యక్తి ఉంటాడు: "దేవుని కుమారా! యేసు! నా జోలి నీకేలా? అంతేకాక నీ పేరేమి అనగా దళము అని సమాధానం చెప్పి మమ్ములను తరిమివేయకుము అని ప్రార్ధించాడు.
సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభువారు దేవుని కుమారుడనీ, దేవుని పవిత్ర మూర్తి అని దయ్యములు సైతము సాక్ష్యములు పలుకుతున్నాయి. దేవుని కుమారుడే కాబట్టి ఆయన అధికార పూర్వకంగా దయ్యములకు వెడటగొట్టెను. బెల్టుబులు సహాయంతో కాదని ఇక్కడ నిరూపించబడింది.