పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ అవశేషాలు మొట్టమొదటిసారి ప్రజలకు దర్శనమివ్వనున్నాయి

జోసెఫ్ అవినాష్
09 Oct 2025
చరిత్రలో తొలిసారిగా పునీత అస్సీసిపుర ఫ్రాన్సిస్ గారి పవిత్ర అవశేషాలను (శరీరాన్ని) ప్రజల దర్శనార్థం ప్రదర్శించనున్నారు.ఈ ప్రదర్శన 2026 ఫిబ్రవరి 22 నుండి మార్చి 22 వరకు జరగనుంది.ఇది ఆయన మరణానికి 800 సంవత్సరాలు (1226-2026) పూర్తవుతున్న సందర్భంలో నిర్వహించబడుతుంది.ఈ ప్రకటన అస్సీసి పవిత్ర ఆశ్రమంలోని “లొజ్జియా డెల్లే బెనెడిజియోని” నుండి అధికారికంగా విడుదల చేయబడింది.ఇప్పటివరకు క్రిప్ట్‌లో భద్రపరచబడిన ఈ పవిత్ర అవశేషాలను,ఇప్పుడు సెంట్ ఫ్రాన్సిస్ బసిలికా దిగువ చర్చిలో ఉన్న పూజపీఠం ముందు భాగంలో ప్రజల దర్శనార్థం ఉంచనున్నారు.చరిత్ర ప్రకారం, ఫ్రాన్సిస్ గారి మరణానంతరం ఆయన శరీరాన్ని దొంగిలించబడకుండా ఉండేందుకు, చర్చిలోని ఉన్నత బలిపీఠం కింద లోతుగా దాచిపెట్టారు.అందువల్ల ఇప్పటివరకు చాలా మందికి అవశేషాలు ప్రత్యక్షంగా చూడటానికి అవకాశం లభించలేదు.ఇప్పుడు వాటిని ప్రజల భక్తి దర్శనార్థం ప్రదర్శించేందుకు పోప్ అనుమతితో ఈ ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయబడింది.