"నేటి వాక్పఠనం -కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు

08 Oct 2025

సీ:
పరలోక మందుండు కరుణా మయా దేవ
మీ నామమే నిత్య గాన మౌత !
మీ దివ్య పరిశుద్ధ మేల్మి రాజ్యము మమ్ము
ఎల్లప్పుడేని పాలించు గాక !
మీ యాజ్ఞ లన్నియున్ మింట వెల్గెడు నట్లు
ఈ ధరాకృతిని శాసించు గాక
నానాటి బోనమ్ము దానమ్ముగా జేసి
పుడమిపై మీలోన నడుపు మయ్య

తే.గీ:
తప్పు చేయ దండించ మా తరమె ? మమ్ము ?
నీవు మన్నించు నటులె మన్నింతు మయ్య
ఇచట శోధింప బడుచు దుఃఖించ కుండ
నీ మహాశాంతి కాంతిలో నిలుపు మయ్య!!
( Ref: లూకా 11:1-4)

Subscription

You do not have an active subscription. Subscribe Below


Welcome User

Signup/Login with your Phone Number to continue with Bharathamithram
LOGIN