యువతే శ్రీసభ భవిష్యత్తు -కార్డినల్ ఫిలిప్ నేరిఫెర్రావ్

జోసెఫ్ అవినాష్
07 Oct 2025
యువత క్రీస్తుకు శిష్యులుగా మారాలని,దేవుడు ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన ప్రత్యేక వరాలను గర్వం కొరకు కాక దేవుని మహిమ కొరకు వాటిని ఉపయోగించాలని అఖిల భారత కతోలిక పీఠాధిపతుల సమాఖ్య అధ్యక్షులు కార్డినల్ ఫిలిప్ నేరిఫెర్రావ్ అన్నారు.ఇండియన్ కాథలిక్ యూత్ మూవ్‌మెంట్ (ICYM) స్థాపించబడి నేటికీ 25 సంవత్సరాలు పూర్తి కావస్తున్న తరుణంలో కేరళలో సిల్వర్ జూబిలీ వేడుకలు మరియు జాతీయ యువజన మహాసభలు అక్టోబర్ 1- 5 జరిగాయి. అందులో పాల్గొన్న యువతను ఉద్దేశించి ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.యువత కేవలం శ్రీసభ భవిష్యత్తు మాత్రమే కాదని శ్రీసభ యొక్క వర్తమానం కూడా అని ఆయన అన్నారు.దేవుడు మీకు ఇచ్చిన ప్రతిభను సమాజ సేవలో ఉపయోగించాలని ఆయన యువతను కోరారు.ఈ మహాసభల్లో దేశ నలుమూలల నుండి సుమారు 2,500 మంది యువకులు మరియు 200 మంది మఠవాసులు పాల్గొన్నారు.