జపమాల గొప్ప వరమాల

గురుశ్రీ మైచర్ల జేసుదాస్
06 Oct 2025
జపమాల గొప్ప వరమాల
అనుదినం జపించండి
పరిశుద్ధ జవమాల
అనుక్షణం కావలసిన
శక్తిని పొందండి.
పండిత పామరులు సైతం
సులభంగా జపించే జపమాల
భక్తితో ప్రార్థించండి
వరాలు అందుకోండి
పరిశుద్దతో జీవించడానికి
ఆయుధం జపమాల
సాతాను శోధనలు
జయించడానికి ధరించండి.
ప్రార్థించడానికి బలమైన
సాధనం జపమాల
పరిశుద్ధ తల్లి ప్రేమను
చవిచూచే పవిత్రమాల
ఎందరో పునీతులు
జపించిన జపమాల
అంతులేని అనుగ్రహాలను
అందించిన అనుగ్రహమాల
శ్రీసభకు మరియమాత
అందించిన
ప్రేమమకుటం జపమాల
జపించినవారు వరాలు పొందిన
దివ్యమాల
ఆధునిక గొల్యాతుల
మనను మార్చే జపమాల
సాతాను టక్కరి జిత్తులను
చిత్తుచేసే దేవమాత అభయమాల
జపమాల సైన్యాన్ని సిద్ధం చేయండి
భూపర లోకాలను
సంధానపరిచే
జపమాల జపించండి.