"నేటి వాక్పఠనం -కవన ధ్యానం"

డా.దేవదాసు బెర్నార్డ్ రాజు
06 Oct 2025
Ref: లూకా 10:38-42
శ్లో :
తే ద్వాదశాః శిష్యాః ఏసునా
ఏకం కుగ్రామం ప్రవివిశుశ్చ
తదాచ మార్తా గృహం గచ్ఛతాః
తస్మాత్ తస్యాతిథ్యం ప్రాప్తాః
...............
భావం :
ఆ పన్నెండు మంది శిష్యులూ ఏసుతో పాటు ఓ చిన్న గ్రామానికి ప్రవేశించారు.అక్కడ మార్త అనే పేరుగల ఓ యింటిముందు ఆగి ,ఆమె ఆహ్వానించగా , లోనికి వెళ్ళి , అంతట ఆమె యిచ్చిన ఆతిథ్యాన్ని స్వీకరించారు.
..............
ఏసునా = ప్రభువుతో పాటు
ప్రవివిశుః= ప్రవేశించారు.
తస్మాత్ = అనంతరం , కనుక
తదా+చ = అప్పుడు
తస్య + ఆతిథ్యం = ఆమె యొక్క ఆతిథ్యాన్ని
ప్రాప్తాః = పొందిన వారు.
శ్లో :
మరియా నామధేయా మార్తాయాః భగినీ
ఏసు పాదే ఉవవిశ్య శ్రద్ధా శిష్యేవ
శ్రోతుమారేభే తస్యోపదేశ కథాంచ
లౌకిక కఠినస్య బంధస్య విస్మృత శుకేవ
........
మార్త యొక్క సహోదరి యైన మరియ పేరుగల అభిమాని యేసురాగానే ఆయన పాదాల దగ్గరే కూర్చొని ఆయన మాటల్నే వినడం మొదలెట్టింది.ఆయన చెప్పే కథల్ని ఓ శిష్యురాలిలా శ్రద్ధగా భక్తితో సమస్తాన్నీ మరచి , బంధిఖానాల్లోంచి స్వేచ్ఛగా ఎగిరిపోయిన పక్షిలా వింతోంది.
....................
మార్తాయాః భగినీ = మార్త యొక్క సోదరి
శ్రోతుమారేభే= వినడం మొదలెట్టింది.
తస్యోపదేశ = ఆయన ఉపదేశం యొక్క
బంధస్య విస్మృత = బంధాల నుంచి విడుదల అయిన
శుక+ ఇవ = చిలక వలె