కతోలికులను దైవ విశ్వాసంలో బలపరచడమే నా ప్రధాన కర్తవ్యం - పోప్

జోసెఫ్ అవినాష్
19 Sep 2025
విశ్వ కాపరి పోప్ లియో XIV తన ఎన్నిక తర్వాత ఇచ్చిన అధికారిక ఇంటర్వ్యూలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుసభను పరిపాలించే ప్రతినిధిగా కతోలికులను దైవ విశ్వాసంలో బలపరచడం,సువార్తను పంచడం మాత్రమే నా బాధ్యతని,ప్రపంచంలోని అన్ని సమస్యలను పరిష్కరించడం పోప్ బాధ్యత కాదని తెలిపారు.శ్రీసభలో కొన్ని వివాదాస్పద అంశాల గురించి ఆయన మాట్లాడుతూ,మహిళా డీకన్లు, సంప్రదాయ లాటిన్ మాస్ వంటి అంశాలు సున్నితమైనవని, ముందుగా మన దృక్పథాలను మార్చుకోవడం అవసరం కానీ వెంటనే సిద్ధాంతాలలో మార్పులు అవసరం లేదని పేర్కొన్నారు.శ్రీసభలో కొన్ని సేవ విభాగాలలో అధికార దుర్వినియోగం నా దృష్టికి వచ్చిందని వాటిని పరిష్కరించే దిశగా ముందుకు నడుస్తానని అదే విధంగా కతోలిక సంఘం అనవసరమైన విషయాలపై గాక సువార్త విస్తరణపైనా దృష్టి పెట్టాలని ఆయన తెలియపరిచారు.