మన పొరుగు వారిని క్రీస్తు చెంతకు నడిపిద్దాం

జోసెఫ్ అవినాష్
18 Sep 2025
సామాన్య 24వ శుక్రవారం
1తిమో 6:2-12
కీర్తన 49:6-10,17-18,19-20
లూకా 8:1-3
యేసుప్రభువు తన ఇహలోక పరిచర్యలో అలసిపోకుండా గ్రామ,గ్రామాలకు,పట్టణానికి సువార్తను బోధించడమే లక్ష్యంగా తన ప్రయాణాన్ని కొనసాగించారు.కానీ యేసు ఒంటరిగా ఈ ప్రయాణాన్ని చేయలేదు.ఆయనతో పాటుగా అపోస్తలులు,ఆయన ద్వారా స్వస్థత పొందిన,క్షమింపబడిన అనేకమంది స్త్రీలు ఉన్నారని ఈనాటి సువిశేష పఠనము తెలుపుతున్నది.యేసు మన జీవితాలను తాకడానికి, స్వస్థపరచడానికి,మనల్ని క్షమించడానికి,మనల్ని సంపూర్ణముగా మార్చడానికి అనుమతించినప్పుడు, ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనను అనుసరించాలని మనం కోరుకుంటున్నాము. యేసును అనుసరించాలనే కోరిక ఉద్వేగభరితమైనది మాత్రమే కాదు,నమ్మశక్యం కాని కృతజ్ఞత దాని ఫలితంగా దేవునితో లోతైన బంధం ఏర్పడుతుంది.ఇది దేవుని దయ వలస,మోక్షం రాజ్యములో ప్రవేశించే బంధం. యేసు అనుచరులు మునుపెన్నడూ అనుభవించని దాని కంటే ఎక్కువ స్థాయిలో పాప మన్నింపును అనుభవించారు.దేవుని కృప వారి జీవితాలను మార్చివేసింది, దాని ఫలితంగా వారు యేసు ఎక్కడికి వెళినా ఆయనను అనుసరించారు. మన జీవితములో కూడా ఆ ప్రభుని క్షమను,స్వస్థతను ఆయన కృపను అనుభవించే వరముకై ప్రార్థించుదాం.
సాధారణ వ్యక్తులైన శిష్యులకు, యేసు గొప్ప శక్తులను దయచేశారు.తనవలే వారు కూడా ప్రజల జీవితాలను మార్చొలని భావించి,వారికీ సాతానులను విడుదల చేసే శక్తిని ప్రసాదించారు.తన తరువాత దైవ రాజ్య బాధ్యత మనిషిదే, కనుక తోటి మనిషిని రక్షించే బాధ్యత మరో మనిషే ఇచ్చాడు.దేవుడు కనుక తోటి వారిని ప్రభువువైపు నడుపించే బాధ్యత మనదే.