“నిశ్శబ్దం”లో కొత్త జీవం పుడుతుంది - పోప్

జోసెఫ్ అవినాష్
18 Sep 2025
విత్తనం చీకటిలో మొలిచినట్లు,కొత్త జీవం కూడా నిశ్శబ్దంలోనే పుడుతుందని సెప్టెంబర్ 17 జనరల్ ఆడియన్స్ లో భాగంగా పోప్ అన్నారు.పవిత్ర శనివారం గురించి ఆయన ఈ సమావేశంలో తన సందేశాన్ని అందించారు.పవిత్ర శనివారం “విశ్రాంతి దినం.” దేవుడు సృష్టి తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు, క్రీస్తు విమోచన కార్యం తర్వాత విశ్రాంతి తీసుకున్నట్లు,మనుష్యులూ ఆగి క్రీస్తులో విశ్రాంతి తీసుకోవాలని పిలుపునిచ్చారు.కానీ మనం ఆగడం చాలా కష్టం.మన జీవితం తొందరపాటు, పనుల్లో నిండిపోయి ఉంటుంది. అందుకే ఆగడం, నిశ్శబ్దంగా ఉండడం, విశ్రాంతిని నేర్చుకోవాలి అని ఆయన గుర్తు చేశారు.పవిత్ర శనివారం అనేది క్రీస్తు మరణానికి మరియు ఆయన పునరుత్థానానికి మధ్యలో ఉండే రోజని ఈ రోజును నిశ్శబ్దం, నిరీక్షణ, మరియు ఆశతో నిండిన రోజుగా మనం విశ్వసిస్తామని జీవితంలో అన్ని ఆగిపోయినట్టుగా, శూన్యంగా అనిపించినా అది వ్యర్థం కాదు. అలాంటి సమయాలను దేవునికి సమర్పిస్తే అవి కృపతో నిండిన కాలాలుగా మారుతాయి అని పోప్ చెప్పారు.