మతాలు విభజనకు కాదు, ఐక్యతకు మూలం కావాలి - పోప్

జోసెఫ్ అవినాష్
17 Sep 2025
ప్రపంచం హింసాత్మక సంఘర్షణలతో కుదేలవుతున్న ఈ కాలంలో మతాలు విభజనకు కారణం కాకుండా, శాంతి, సోదరత్వం, ఐక్యతకు మూలంగా ఉండాలని అస్తానా (కజకిస్తాన్)లో జరిగిన ప్రపంచ 8వ అంతర్మత సమాలోచన మహాసభకు తాను పంపించిన సందేశంలో పోప్ వివిధ మత ప్రతినిధులను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు.నిజమైన మతం ఎల్లప్పుడూ సంభాషణ, సహకారం కోరుతుంది.అది మనుషులను కలుపుతుంది కానీ విడదీయదని పోప్ పేర్కొన్నారు.అన్ని మత నాయకులు కలిసి శాంతి నిర్మాణంలో కట్టుబడి పనిచేయాలని,మత విశ్వాసం కలుపుతుంది గాని విడదీయదని తమ సాక్ష్యంతో నిరూపించాలని కోరారు.