క్రీస్తును అనుసరిద్దాం

జోసెఫ్ అవినాష్
31 Aug 2025
సామాన్య 22వ సోమవారం
1తెస్స 4:13-18
కీర్తన 96:1-3,4-5,11-13
లూకా 4:16-30
ధ్యానం:
నజరేతులోని ప్రజలు యేసు ప్రభువును కొండపై నుండి తోసివేయాలని ప్రయత్నించినప్పుడు ఆయన నిశ్శబ్దతతో ప్రతిస్పందించడం మనం ధ్యానిస్తున్నాము.ప్రవక్త తన స్వదేశంలో ఎప్పుడూ గౌరవింపబడడని యేసు ప్రభువు మనకు వివరించారు. యేసుప్రభువుకి తాను ఎవరో తన బాధ్యత,తన లక్ష్యం ఏమిటో బాగా తెలుసు. అందుకనే తాను చేయబోవు పనిని ముందుగానే అందరికి తెలియజేస్తున్నారు.సాధారణ కుటుంబములో జన్మించిన వ్యక్తి దైవిక కార్యములను చేస్తానంటే,ఎవరు నమ్మలేదు, అవిశ్వాసమును తెలియపరిచారు.ఎవరూ కూడా నమ్మలేదు.నజరేతు ప్రజలు యేసుప్రభుని భోదపై చాలా కోపంతో ఆయనను కొండపై నుండి తోసేయాలని అనుకున్నారు.కానీ వారి ప్రవర్తనకు యేసు ప్రతిస్పందించలేదు.ప్రభువు వారి మధ్యనే నడుస్తూ,తన దారిలో తాను వెళ్లిపోయారు. అలాగే మన కుటుంబాల్లో, మన జీవితాలలో, క్రీడలు, డబ్బు, రాజకీయాలు వివిధమైన అంశములపై వాగ్వాదం జరిగినప్పుడు మనం కూడా మౌనం పాటించి, ప్రార్ధన చేయాలి.మనం ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనంగా ఉండాలో వివేచించేలా ప్రభుని ప్రార్ధించాలి.ఇది ఇంట్లో ఉండేవారికి, సమాజంలో పని చేసేవారికి, జీవితంలోని ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది, కాబట్టి మనం యేసుప్రభువును మన జీవితాలలో అనుకరించాలి.