శ్రీలంకలో ఘనంగా జరిగిన మిజార్క్ వరల్డ్ 70వ వార్షికోత్సవం

జోసెఫ్ అవినాష్
29 Aug 2025
2025 ఆగస్టు 28న మిజార్క్ వరల్డ్ (కతోలిక వ్యవసాయ-గ్రామీణ యువజన సేవ విభాగం) 70వ వార్షికోత్సవంను, అలాగే 20వ మహాసభను శ్రీలంకలో ఘనంగా జరుపుకుంది.“గ్రామీణ యువత మరియు వ్యవసాయం” అంశంపై జరిగిన ఈ సమావేశంలో ఆఫ్రికా, ఆసియా, యూరప్, లాటిన్ అమెరికా, కరీబియన్ దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు.
సమావేశాన్ని శ్రీకాకుళం పీఠాధిపతులు మహా ఘన.విజయ్ రాయరాలా తండ్రి గారు ప్రారంభించారు. జెండా ఆవిష్కరణ, శ్రీలంక సంప్రదాయ నృత్యాలతో ప్రారంభమైన ఈ వేడుకలో, యువత భవిష్యత్తు, వ్యవసాయంలో కొత్త ఆవిష్కరణలు, పర్యావరణ పరిరక్షణపై లౌడాటో సి’ స్ఫూర్తితో చర్చలు జరిగాయి.“భూమి కేక, పేదల కేక ఒక్కటే” అని నొక్కి చెబుతూ, యువతలో పర్యావరణ పరివర్తన అవసరాన్ని తండ్రి గారు గుర్తు చేశారు.ఈ మహాసభ, గ్రామీణ యువతను ఏకం చేస్తూ, స్థిరమైన వ్యవసాయం, పర్యావరణ బాధ్యత వైపు కొత్త సంకల్పానికి వేదికైంది. ఈ సభలో తెలుగు ప్రాంతీయ యువజన డైరెక్టర్, ఫా. స్లీవరాజు, జాతీయ సత్యోపదేశ సేవా విభాగ డైరెక్టర్ ఫా. ప్రదీప్ పాల్గొన్నారు.