ఏలూరు పీఠానికి ఐదుగురు నూతన గురువులు

ఫాదర్ చల్ల డేవిడ్ (భారతమిత్రం, ప్రధాన సంపాదకులు)
28 Aug 2025
ఆగస్టు 27న ఏలూరు పీఠ కాపరి మహా ఘన. పొలిమేర జయరావు తండ్రిగారి జన్మదినాన ఏలూరు కథడ్రాల్ వేదికగా గురుపట్టాభిషేక వేడుక కన్నుల పండుగగా జరిగింది.ఈ వేడుకకు విశ్రాంత బొంబాయి కార్డినల్ ఒస్వాల్డ్ గ్రేసియస్ అతిథిగా విచ్చేయగా వారి స్వహస్తాల మీదగా ఐదుగురు దైవాంకితులు గురువులుగా అభిషేకించబడ్డారు.ఈ వేడుకలో ఏలూరు పీఠానికి చెందిన గురువులు,కన్యాస్త్రీలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొని నూతన గురువులకు శుభాకాంక్షలు తెలిపారు.