అమెరికా పాఠశాలలో కాల్పుల కలకలం దిగ్బ్రాంతి వ్యక్తం చేసిన పోప్

జోసెఫ్ అవినాష్
28 Aug 2025
అమెరికాలోని మిన్నెసోటా రాష్ట్రం మినియాపోలిస్‌లోని ఓ క్యాథలిక్ పాఠశాలలో ఆగస్టు 26, 2025 న విద్యార్థులు ప్రార్థన చేస్తున్న సమయంలో నిందితుడు కిటికీల ద్వారా కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతి చెందారు, 17 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో 14 మంది పిల్లలు ఉన్నారు. నిందితుడు కూడా మరణించాడు. ఈ ఘటనపై జగద్గురువులు పోప్ లియో XIV తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన చిన్నారుల ఆత్మ విశ్రాంతికై ప్రార్థించారు. గాయపడిన వారు త్వరితగతిన కోలుకోవాలని ఆకాంక్షించారు.