ప్రభు బిడ్డలుగా జీవించుదాం.

జోసెఫ్ అవినాష్
27 Aug 2025
సామాన్య 21వ గురువారం
1తెస్స 3:7-13
కీర్తన 90:3-5,12-14,17
మత్తయి 24:42-51
ధ్యానం:
"నీ విచక్షణే నీకు ఉపాధ్యాయుడుగా ఉండాలి". మాటకే చేతకీ,చేతకీ మాటకి పొంతన ఉండేటట్లు చేసుకో
- షేక్స్పియర్.
జ్ఞానానికి,వివేకానికి ఆయువు పట్టు ఆలోచన శక్తి దృఢ సంకల్పంతో ఆలోచించి జీవిత వాస్తవాలను గ్రహించడం జ్ఞానం.ఈ జ్ఞానాన్ని దైవ కృపవలన స్వయం అనుభవం వలన, విద్యవలన పొందగలం.ఈ విధంగా గడించిన జ్ఞానాన్ని జీవితానికి అస్వయించడం వివేకం అంటారు.వీరికి మంచి చెడుల విచక్షణ పుడుతుంది. ఈనాడు వాక్యం క్రీస్తు రెండవ రాకడ తుది తీర్పు గురించి బోధిస్తుంది.నేటి సువార్తలో ప్రభు ఊహించని గడియలో వస్తాను అని తెలియపరుస్తున్నాడు.ఈ రోజుతో ఏ సమయంలో ఏమి జరుగుతున్నదో తెలియని పరిస్థితిని మనం కన్నులారా చూస్తున్నాము. టెర్రరిస్టులు చేతులలో ఎంతో మంది బలిఅయ్యారు.బస్సు,రైలు, విమానం,స్కూటర్, ఇంకా ఎన్నో వాహనాలు అనుకోకుండా ప్రమాదాలు జరిగి మరణిస్తున్నారు.గడచిన 12 సంవత్సరాల క్రిందట ఒక వ్యక్తి అమెరికాలోని 110 అంతస్తుల భవనం చూడటానికి వెళ్ళాడు. చాలా సంతోషపడ్డాడు.తన ఆనందమును తన కుటుంబ సభ్యులతో,ఇరుగుపొరుగువారితో పాలు పంచుకోవాలి అని
ఒక ఫోటో తీయించుకొనే సమయంలోనే ఆ 110 అంతస్థుల భవనం విమాన దాడికి నేలకూలి ఆ మనిషి ఆ భవనం క్రింద పడి మరణించాడు.ఊహించని గడియ మారుమనస్సు పొంది ప్రభువు కోరుకున్నట్లు ప్రభు బిడ్డలుగా జీవించుదాం.