ఇతరుల కోసం చేసిన త్యాగమే నిజమైన ప్రేమ -పోప్

జోసెఫ్ అవినాష్
27 Aug 2025
ప్రార్థనలో మనం దేవుని బాధలనుండి తప్పించమని అడగకూడదని వాటిని ఎదుర్కొనే ధైర్యాన్ని ప్రసాదించమని వేడుకోవాలని జనరల్ ఆడియన్స్ సందర్భంగా పోప్ అన్నారు.గెత్సేమని తోటలో క్రీస్తు శ్రమలను చూసి వెనకడుగు వేయలేదని ఆయన తనను తాను శత్రువులకు అప్పగించుకున్నాడని దానికి ప్రధాన కారణం సకల మానవాళి పట్ల ఆయనకు గల ప్రేమని పోప్ అన్నారు.గెత్సేమని తోటలో మీరు వెతుకుతున్న నజరేయుడైన క్రీస్తును నేనే అని ఆయన పలికినప్పుడు దేవుని నామం అక్కడ ప్రతిధ్వనించబడి సైనికులు వెనక్కి పడిపోయారని అంధకారం,అన్యాయం, ఒంటరితనం మధ్యలో కూడా దేవుడు మనతోనే ఉన్నాడని ఈ సంఘటన సూచిస్తుందని పోప్ అన్నారు.క్రైస్తవ విశ్వాసి భయాందోళనలు ఎదురైనప్పుడు వాటినుండి పారిపోకుండా ధైర్యంగా నిలబడి పోరాడాలని ఆయన తెలియపరిచారు.