పేదలతో కలిసి విందు ఆరగించనున్న పోప్

జోసెఫ్ అవినాష్
09 Aug 2025
కతోలిక విశ్వకాపరి పోప్ లియో XIV ఆగస్టు 17,ఆదివారం నాడు, ఇటలీలోని అల్బానోకు వెళతారని అక్కడి నిరుపేదలతో కలిసి పూజబలిని సమర్పించి,వారితో కలిసి భోజనం చేస్తారని వాటికన్ సమాచార యంత్రాంగం ఒక ప్రకటనలో తెలిపింది.పోప్ పదవి కాలంలో పేదలతో సమావేశమవడం ఇదే మొదటిసారి అని వాటికన్ తెలిపింది.