సంపూర్ణ సమర్పణా జీవితమే విశ్వాసానికి పునాది

జోసెఫ్ అవినాష్
08 Aug 2025
"సామాన్య 18వ శనివారం
ద్వీతియో 6:4-13
కీర్తన 18:2-4,47-51
మత్తయి 17:14-20
ధ్యానం-:
యేసును అనుసరించే వారి లక్ష్యం దేవుని పైనే ఉండాలి. యేసు భక్తితో తన్మయత్వంపొందే ప్రతి ఒక్కరు విశ్వాసముతో దేవుని కోసం గొప్ప కార్యాలు చేస్తారు. మన భాషలో ఈ సామెతను మనము విని ఉంటాము. అమాయకులైన బిడ్డలను చూచి తల్లి లేదా తండ్రి ఈవిధంగా బాధతో చెప్తు ఉంటారు. నేను చస్తే నీవు ఎలా బ్రతుకుతావురా? దీని అర్ధం ఏమిటంటే నీవు నా మీద ఆధారపడి జీవిస్తున్నావు. నేను చనిపోయిన తర్వాత ఎలా బ్రతుకుతావు అని అర్ధము. అదే విధముగా ఈనాటి సువార్తా పఠనములో క్రీస్తు ప్రభువు శిష్యులతో ఎంత కాలము మీతో ఉందును అని ప్రశ్నించుతాడు. పైన చెప్పిన సామెతలో చెప్పిన విధముగా క్రీస్తు కూడా నేను ఈ లోకమును వీడిన తర్వాత మీరు ఏ విధముగా అద్భుతాలు చేస్తారు అని చెప్పి దానికి సమాధానంగా ప్రార్థన, ఉపవాసముల ద్వారా కనీసం ఆవగింజంత విశ్వాసము మీలో ఉన్న నా అద్భుత శక్తిని పొంది మీరు అద్భుతాలు చేయగలుగుతారు అని చెప్పుచున్నారు. మనము కూడా దృఢమైన విశ్వాసముతో కనీసం ఆవగింజంత విశ్వాసం కలిగి ఉపవాసము చేసిన ప్రభు అద్భుత శక్తిని చూడగలుగుతాము.