మఠవాసుల పై దాడి చేసిన మతోన్మాదులు

జోసెఫ్ అవినాష్
08 Aug 2025
ఆగస్టు 6, 2025న, ఒరిస్సా రాష్ట్రంలోని జలేశ్వర్ పీఠ పరిధిలోని గంగాధర్ గ్రామం సమీపంలో దారుణం చోటుచేసుకుంది.సుమారు 70 మంది మతోన్మాదులు ఇద్దరు కతోలిక గురువులు,ఒక ఉపదేశి మరియు ఇద్దరు కన్యా స్త్రీలను మత మార్పిడులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ వారి పై దాడి చేశారు.వారు ఒక ఆధ్యాత్మిక కార్యక్రమం నిమిత్తం గ్రామానికి రాగా,ఆ కార్యక్రమాన్ని ముగించుకొని రాత్రి 9 గంటల ప్రాంతంలో వారు బయలుదేరుతుండగా,వారిని ఎదుర్కొని దాడి చేశారు.ముందు వారు మోటార్ సైకిల్ పై ఉన్న ఉపదేశిని దుర్భాషలాడుతూ ఆయనపై పై దాడి చేయడం ప్రారంభించారు,అంతటితో ఊరుకోకుండా అతని మోటార్ సైకిల్ ను ధ్వంసం చేశారు.గురువులు మరియు కన్యాస్త్రీలు భౌతికంగా దాడి చేయబడ్డారు.గ్రామస్తులు వారి సందర్శన ఉద్దేశ్యాన్ని స్పష్టం చేసినప్పటికీ,దాడి కొనసాగింది.ప్రస్తుతం ఈ సంఘటన చర్చనీయాంసంగా మారింది.గత కొంతకాలంగా క్రైస్తవులపై మతోన్మాదులు దాడులు చేస్తూనే ఉన్నారు.క్రైస్తవులకు కొన్ని ప్రత్యేకమైన చట్టాలు ప్రభుత్వాలు తీసుకురావాలని సామాజిక మాధ్యమాల ద్వారా క్రైస్తవ విశ్వాసులు ప్రభుత్వాలను కోరుతున్నారు.