క్రీస్తును అనుసరిద్దాం

జోసెఫ్ అవినాష్
07 Aug 2025
సామాన్య 18వ శుక్రవారం
ద్వీతియో 4:32-40
కీర్తన 77:12-15,16-21
మత్తయి 16:24-28
పెరుగుచున్న ఈ ఆధునిక ప్రపంచములో మనిషి అన్నిటిని సంపాదించుకోవాలని ఆరాటపడుచున్నాడు.మనకు ఆస్తులు,అంతస్థులు,బిడ్డలు, భూములు,ఉద్యోగాలు,సకల వస్తువులు మన మధ్య ఉన్న కూడా మన హృదయాంతరంగములో ఎక్కడో తెలియని కొరత. పునీత ఫ్రాన్సీస్ శౌరివారు తనకున్న జ్ఞానము, తెలివితేటలు ప్రభువునుంచి వచ్చినవి అని గ్రహించి,అర్ధం చేసుకొని తన సువార్తా సేవ ద్వారా వేలాదిమంది విశ్వాసులకు క్రీస్తుకు పరిచయం చేశారు.బోన్పేర్ అనే వేదపండితుడు క్రీస్తుని అనుసరించు వారికి రెండు పద్ధతులు ఉన్నవి అని చెప్పారు.
మొదటిది:- క్రీస్తుని సిలువను మోసి ఆయన కొరకు మరణించడం.
రెండవది:- సిలువలో ఆయనను మరల చంపటం అన్నారు.
ఈ రెండింటిలో మనం దేనిని అనుసరించుటకు సిద్ధంగా ఉన్నామా? ఈనాటి సువార్తలో క్రీస్తుప్రభువు “నన్ను అనుసరింప గోరువాడు తన్నుతాను పరిత్యజించుకొని, తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరింపవలెను.” తన కొరకు ప్రాణమును ధారపోయువాడు దానిని దక్కించుకొనును అంటున్నారు. అనేక విషయములు,అనేక ఆలోచనలతో మనం ఆత్మను నిర్లక్ష్యం చేస్తున్నాము. ఆత్మీయతను పొగొట్టుకుంటున్నాము. ముందుగా సిలువ కోసం సమయాన్ని ఇచ్చే వారిగా మన జీవితాలను మలచుకొందాం. ఆత్మను కొల్పోకుండా జీవించే భాగ్యం మనకు దయచేయాలని ప్రార్థించుదాం.