ప్రపంచంలో సోదర భావం వికసించాలి - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్
07 Aug 2025
జపాన్ లోని హిరోషిమా,నాగసాకి అను విధ్వంసానికి గురై 80 ఏళ్లు పూర్తి కావస్తున్న తరుణంలో విశ్వ కాపరి పోప్ లియో XIV నాటి విషాదాన్ని మరొకమారు నెమరు వేసుకున్నారు.ప్రపంచంలో శాంతి,సోదర భావం వికసించాలని ఆయన పిలుపునిచ్చారు.ఈ దాడులలో మరణించిన వారిని ఆయన స్మరించుకున్నారు.ఈ దాడులు జరిగి 80 ఏళ్లు పూర్తి కావస్తున్న ఈ దాడుల వల్ల జరిగిన నష్టం మాత్రం ప్రతిరోజు ఆలోచింప చేస్తుందని ఆయన అన్నారు.ఈ సంఘటనలపై ఆయన తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, లేఖ ద్వారా హిరోషిమా పీఠాధిపతికి పోప్ సానుభూతి వ్యక్తపరిచారు.