ఇది దేవాలయం అనడానికి గుర్తులుగా నిలచే పవిత్ర స్థానాలు ఏవి?

కతోలిక శ్రీసభ సత్యోపదేశం
06 Aug 2025
దేవాలయంలో అత్యంత ప్రాధాన్యంగల ప్రదేశాలు - సిలువ స్వరూపంతో కూడిన బలిపీఠం, దివ్యమందసం, పీఠాధిపతులు లేదా గురువులు ఉపయోగించే ఆసనం, దైవవాక్కు పీఠం, జ్ఞానస్నాన జలకలశం, ప్రాయశ్చిత్త సంస్కారాన్ని (పాపసంకీర్తనం ఆచరించడానికి అనువైన చోటు. (CCC1182,1188).
దేవాలయానికి కేంద్రస్థానం బలిపీఠం.ఈ పవిత్ర పీఠం మీదనే -ప్రభుక్రీస్తు మరణపునరుత్థానాల రక్షణఘట్టం దివ్యపూజలో మరోమారు జరుగుతుంది, మనకు రక్షణఫలాలను ప్రసాదిస్తుంది.ఈ బలిపీఠం సన్నిధికే దైవజనులందరు ఆహ్వానింపబడుతారు,ప్రభు సన్నిధానంలో తమ ఏకతను చాటి చెబుతారు. దేవాలయంలోని మరొక పవిత్రస్థానం -దివ్యమందనం. యేసుక్రీస్తు ప్రభువు కొలువుదీరి ఉండే దివ్యసత్ప్రసాదాన్ని ఈ దివ్యమందసంలో పదిలపరుస్తారు. దివ్యమందసం సమీపంలో "నిత్య దీపం" ఒకటి నిరంతరమూ వెలుగుతూ ఉంటుంది.ఈ దీపం వెలుగుతూ ఉన్నదంటే - దివ్యమందనంలో ప్రభువు కొలువున్నారని అర్థం.అలాగే బలిపీఠం వెనుక ఉన్నతస్థానంలో పీఠాధిపతుల ఆసనంగానీ, గురువుకూర్చునే ఆసనంగానీ ఉంటుంది.అది క్రీస్తు నాయకత్వానికి గుర్తు. అదేవిధంగా "వాక్కు పీఠం (Lectem)". సజీవ దేవుని దివ్యవాక్కును ప్రకటించే ఈ "వాక్కు పీఠం" గౌరవప్రదంగా ఉండాలి.. అలాగే - దేవాలయంలో జ్ఞానస్నానం ఆచరింపజేయడానికి మన జ్ఞానస్నాన వాగ్దానాలను నెరవేర్చడానికి "జ్ఞానస్నాన జల కలశం" ఏర్పాటు చేయాలి. ఆఖరున - పాపసంకీర్తనం (పాపోచ్ఛరణం) కోసం దేవాలయంలో అనువైన ప్రదేశాన్ని ఏర్పాటు చేయాలి.