మరియమాతను అనుసరించండి - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్
06 Aug 2025
యువత మరియమాత విశ్వాస జీవితాన్ని సుమాతృకగా స్వీకరించాలని అదేవిధంగా యువత ఒకరినొకరు ప్రేరేపించుకుంటూ, ఒకే తాటిపై కలిసి నడుస్తూ, దైవ మార్గంలో నడవాలని మెడ్జుగోర్జేలో జరుగుతున్న 36వ అంతర్జాతీయ యువజన ఉత్సవాలలో పాల్గొంటున్న యువతను ఉద్దేశించి పోప్ పై వ్యాఖ్యలు చేశారు. ఏసుక్రీస్తుప్రభువు నేనే మార్గం అని తెలియపరుస్తున్నారని మనం దారి తప్పకుండా ఆయన ప్రేమ మార్గంలో నడవాలని యువతను ఆదేశించారు.క్రీస్తు స్వయంగా మనతో ఉంటారని,మనతో నడుస్తారని,మనల్ని బలపరుస్తారని ఆయన అన్నారు.