యెమెన్ తీరంలో వలసదారుల పడవ బోల్తా పోప్ సంతాపం

జోసెఫ్ అవినాష్
05 Aug 2025
యెమెన్ తీరంలో వలసదారుల పడవ మునిగిపోవడంతో 76 మంది ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ఆచూకీ గల్లంతైందని ఐక్యరాజ్యసమితికి చెందిన మైగ్రేషన్ ఏజెన్సీ ప్రకటించింది. సోమవారం దక్షిణ అబ్యాన్ ప్రావిన్స్ తీరప్రాంతంలో రెస్క్యూ బృందాలు 76 మృతిదేహాలను వెలికితీశాయి. ఈ దుర్ఘటనపై పోప్ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తూ, మృతుల ఆత్మలు నిత్య విశ్రాంతి పొందు లాగున ప్రార్థిస్తున్నాను తెలిపారు.క్షతగాత్రులు త్వరితగతిన కోల్కొని మునుపటి స్థితిలోకి రావాలని దేవుని ప్రార్థిస్తున్నానని,ప్రతి ఒక్కరు ప్రార్థించాలని ఆయన విశ్వ శ్రీసభను కోరారు.