వృద్ధాప్యం దేవుని రక్షణ ప్రణాళికలో భాగం - పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్
11 Jul 2025
వృద్ధాప్యం దేవుని రక్షణ ప్రణాళికలో భాగమని వృద్ధులందరూ ఆ ప్రణాళికలో భాగం కావడానికి పిలవబడ్డారని జగద్గురువులు పోప్ లియో XIV అన్నారు.ఈ నెలలో శ్రీసభ అవ్వ - తాతల దినోత్సవాన్ని జరుపుకోనున్న నేపథ్యంలో పోప్ తాను వ్రాసిన సందేశంలో ఈ వ్యాఖ్యలు చేశారు.బైబిల్ లో వృద్ధులైన అబ్రహాము,సారా,జెకర్యా, ఎలిజబేతమ్మ జీవితాలను దేవుడు ఎంతగానో దీవించి,ఆశీర్వదించారని వృద్ధులు దేవుని యందు నిరీక్షణ కలిగి జీవించాలని నిరీక్షణ లోతైన ఆనందానికి మూలమని ఆయన అన్నారు.దేవుని దృష్టిలో వృద్ధాప్యం అనేది కృపా కాలమని ,దేవుని యందు విశ్వాసం కలిగి జీవించడం వృద్ధులకు బలాన్ని ఇస్తుందని, యువత వృద్ధులకు అండగా ఉంటూ,వారి జీవిత అనుభవాలను సుమాతృకగా స్వీకరించి,దైవ బాటలో అడుగులు వేయాలని ఆయన తన సందేశంలో పేర్కొన్నారు.