ఉక్రెయిన్ అధ్యక్షుడిని కలిసిన పోప్ లియో XIV

జోసెఫ్ అవినాష్
10 Jul 2025
మంగళవారం పోప్ లియో XIV ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీని తన నివాసంలో కలిసి ముచ్చటించారు.ఈ సమావేశంలో ఉక్రెయిన్‌లో జరుగుతున్న యుద్ధం మరియు శాంతిస్థాపనకై తీసుకోవాల్సిన తగు చర్యలు గురించి చర్చించుకున్నారు.యుద్ధ బాధితుల పట్ల పోప్ తన విచారాన్ని వ్యక్తం చేశారు మరియు ఉక్రేనియన్ ప్రజలకు తన ప్రార్థనలు మరియు నిరంతర సాన్నిహిత్యం గురించి హామీ ఇచ్చారు.ఖైదీల విడుదల మరియు వారి కుటుంబాల నుండి తప్పిపోయిన చిన్నారి బిడ్డలను వెతికి, రక్షించి గూటికి తీసుకురావడానికి ఉక్రెయిన్ అధికారులు చేస్తున్న కృషిని ఆయన అభినందించారు.సమావేశం తర్వాత, అధ్యక్షుడు జెలెన్స్కీ మీడియాతో మాట్లాడుతూ! మాకు ఎంత కాలం నుండో సహాయ ,సహకారాలు అందిస్తున్న వాటికన్ కు, పోప్ కు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నానని , ఈ సమావేశంలో పాల్గొనడం, పలు విషయాలు చర్చించడం ఎంతగానో సంతోషాన్నిచ్చిందని ఉక్రెయిన్ కు వాటికన్ మద్దతు ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఆయన తెలిపారు.