సాలోమోను జ్ఞానం - దేవుని ఉద్దేశం

మహా ఘన. డా.సగినాల ప్రకాశ్
09 Jul 2025
ప్రశ్న -
సాలోమోనుకు, ప్రభువు, ఎవరికీ ఇవ్వనంత జ్ఞానాన్ని వివేకాన్ని ఇవ్వటానికి కారణమేమిటి?
సమాధానము -
ఇద్దరు స్త్రీలు సాలోమోను రాజుముందు నిలువబడినారు. అందులో ఒక స్త్రీ రాజుతో,తన కుమారుని తన ఇంటిలోనే నివాసముంటున్న మరొక స్త్రీ అపహరించిందని వాపోయింది.ఇక రెండవ స్త్రీ తన పద్ద ఉన్నది తన కొడుకేనని,ఆరోపణ చేస్తున్న స్త్రీ బిడ్డ చనిపోయాడని వాదించింది.నిజానికి ఎవరికీ ఈ సమస్యను తీర్చడం చేతకాలేదు.రాజు తన సేవకునితో,కత్తితో బిడ్డను రెండు భాగాలు చేసి చెరొక భాగం ఇవ్వమన్నాడు. కన్నకడుపు ఉలిక్కిపడింది. బిడ్డను చంపవద్దని రెండవ స్త్రీకే ఇచ్చేయమని ప్రార్ధించింది. రెండవ స్త్రీ మాత్రం రెండు భాగాలు చేయమంది.రాజు, మొదటి స్త్రీయే నిజమైన తల్లి అని తీర్పు ఇచ్చాడు.బిడ్డను నిజమైన తల్లికి అప్పగించాడు. ఈ తీర్పు విని ప్రజలంతా హర్షించారు.దేవుడు రాజునకు న్యాయము నిర్ణయించు వివేకాన్ని ఇచ్చాడని నమ్మారు (1 రాజులు 3:16-28).దావీదు తరువాత తన ప్రజలను పరిపాలించడానికి, సొలోమోనును ఎన్నుకున్నాడు.
ప్రభువు తనకు ఏం కావాలో కోరుకోమంటే,ఇశ్రాయేలు ప్రజలు సంఖ్యలో అధికంగా ఉన్నారని,అంతటి గొప్ప ప్రజలను పరిపాలించడానికి కావలసిన జ్ఞానము,వివేకము ఇవ్వమని అడిగాడు.ఈ కోరిక ప్రభువుకు సంతోషాన్ని కలుగజేసింది.స్వార్థంతో ధనాన్ని,బలాన్ని, కోరుకోకుండా ప్రజల శ్రేయస్సు కోరిన సాలోమోను, ప్రభువు దృష్టిలో ప్రీతి పాత్రుడయ్యాడు (1 రాజులు 3:10).అందుకు ప్రతిఫలంగా దేవుడు అతనికి జ్ఞానాన్ని ప్రసాదించాడు. ప్రజలు కూడా సోలోమోనుకున్న వివేకానికి భయపడి, ధర్మాచరణలో న్యాయబద్ధంగా జీవించేవారు. రాజుల చరిత్ర, మంచి చెడుల కలయిక. అయితే ప్రజల కోసం మంచి ఎక్కువగా చెప్పబడింది. సొలోమోను ప్రభువును ప్రేమించి, తన తండ్రి మార్గంలో పయనిస్తూ, ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించాడు. అందుకే దేవుడు అతనికి జ్ఞానాన్ని, వివేకాన్ని (1 రాజులు 3:3).