పెంతుకోస్తు పండుగ సందర్భంగా

కొండవీటి అంతయ్య, సత్తెనపల్లి
07 Jun 2025
పెంతెకోస్తు పండుగ!
..............................................
అంతా జ్ఞానము బలము పొందగా
పెంతెకోస్తను పండు గొచ్చెగా
దైవాత్మే అవనికి దిగి రాగా
అవనిలో శ్రీ సభ వెలసెనుగా!
యేసుని శిష్యులు ధైర్యమందగా
పరిశుద్ధాత్మే యిల కొచ్చెనుగా
అగ్ని నాలుకల రూపము లోనా
ప్రజ్ఞనివ్వ దిగె శిష్యుల పైనా!
అనుగ్రహవరములనాత్మ దేవుడే
మనుష్యులపైన కురిసెను నేడే
పరిశుద్ధాత్మ వరములే పొందుదాములే
బుద్ధీ జ్ఞానములందుదాములే!