స్వరూపాలను ధ్వంసం చేసిన దుండగలు

జోసెఫ్ అవినాష్
06 Jun 2025
నెదర్లాండ్స్‌లోని డోర్‌వర్త్‌లో నిన్ను దారుణం చోటు చేసుకుంది. గుర్తుతెలియని దుండగులు ధ్యానాశ్రమం మరియు సమీప స్మశానవాటికలో ప్రవేశించి అల్లకల్లోలం సృష్టించారు. ప్రార్థన మందిరంలో పునీతుల స్వరూపాల తలలను ధ్వంసం చేశారు. సమాధులపై సిమెంట్ సిలువలను ధ్వంసం చేశారు.యూరప్‌లోని క్రైస్తవులపై గత కొంతకాలంగా వివక్షతో కొందరు దాడులు జరుపుతున్నారు. ఈ దాడి కూడా అందులో భాగమని పారిష్ బోర్డు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. విచారణ గురువులు ఫాదర్ మెనెసెస్ మాట్లాడుతూ, ఇటువంటి విధ్వంసం "సమాజ ప్రశాంతతకు భంగం కలిగిస్తుంది, విశ్వాసుల ఆత్మను దెబ్బతీస్తుంది మరియు మనకు ప్రియమైన పవిత్ర స్థలాల పట్ల గౌరవాన్ని దెబ్బతీస్తుంది" అని దుండగులను త్వరితగతిన పట్టుకోవాలని ఆయన మీడియాకు తెలిపారు.
