పోప్ లియో XIV కు తమిళనాడుతో ప్రత్యేక అనుబంధం

Matters india
16 May 2025
ఇటీవలే నూతన విశ్వ శ్రీసభ కాపరిగా ఎన్నికైన పోప్ లియో XIV కు తమిళనాడుతో అనుబంధం ఉంది. ఆయన 2006లో కోయంబత్తూరు జిల్లా పొళ్లాచ్చి ప్రాంతంలోని పునీత అగస్టియన్ సభ నిర్వాహకులు నడుపుతున్న శెన్బగం పాఠశాలను సందర్శించారు. ఆ సమయంలో స్కూల్ క్యాంపస్ ముందు పోప్ తీసుకున్న ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.'ఆయన రావడం గౌరవంగా ఉంది'
కొత్తగా ఎన్నికైన పోప్ లియో XIV గతంలో శెన్బగం పాఠశాలను సందర్శించడంపై ఆ స్కూల్లో పనిచేస్తున్న ఫాదర్ సుమేశ్ జోసెఫ్ స్పందించారు. కొత్తగా ఎన్నికైన పోప్ తమిళనాడులోని పొళ్లాచ్చి ప్రాంతానికి రావడం గౌరవంగా ఉందన్నారు. తమిళుల గురించి ఆయన తెలుసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు.