శ్రీసభలో మఠవాసుల సంఖ్య పెరగాలని ప్రార్థించండి - పోప్ లియో XIV

వాటికన్ వార్తా విభాగం
15 May 2025
కతోలిక సంఘంలో దైవ పిలుపుల సంఖ్య పెరగాలని, అదేవిధంగా గురుత్వ జీవితానికై తమ జీవితాలను సంపూర్ణంగా దేవునికి సమర్పించిన ప్రతి మఠవాసి కొరకు ప్రతిరోజు ప్రార్థించాలని విశ్వ కతోలిక కాపరి పోప్ లియో XIV తెలియపరిచారు.11-5-2025 కతోలిక శ్రీసభ మంచి కాపరి ఆదివారాన్ని, అదేవిధంగా దైవ పిలుపుల దినోత్సవాన్ని జరుపుకున్న సందర్భంగా పోప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఏసుక్రీస్తు ప్రభువు మనందరినీ సంరక్షించే మంచి కాపరిగా సువిశేషం వర్ణించిందని మనం ఆయన గొర్రె పిల్లలమని ఆయనను తెలుసుకొని ఆయన ఆదేశాలను అనుసరిస్తూ ఆయన బాటలో పయనించాలని పోప్ కోరారు. దైవాంకిత జీవితం ఎంతో శ్రేష్టమైనదని విశ్వాసులను, సంఘాన్ని ఆధ్యాత్మిక బాటలో నడిపించాలని ఆయన గురువులను ఆదేశించి తన ప్రసంగాన్ని ముగించారు.