తపస్సుకాల ఆచరణ,పునీత అగస్టీను మాటల్లో

సిస్టర్ దీప్తి
25 Mar 2025
పాపంలో కొట్టు మిట్టాడుతున్న మనకు పునీత అగస్టీను గొప్ప ఉపశమనం కదా!! ఈ పునీతునికి వీరాభిమానులు ఎక్కువే.అయితే వీరు తపస్సుకాలంలో చేసిన కార్యం, తాను నొప్పించిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ కోరడం, శత్రువుల కోసం ప్రార్థించడం, ఈ రెండు పనులు చేయాలంటే గుండెల్లో దమ్ముండాలి మరి క్రీస్తుని ప్రేమ, వినయం ఒక మనిషి ఆత్మలో ఎంతగా నిండి ఉంటే ఈ ఉన్నత ఆలోచన తట్టుతుందో ఇక ఆలస్యం చేయకుండా, ధైర్యంతో, మనం గాయపరిచిన వారి వద్దకు వెళ్ళి క్షమాపణ అడుగుదాం మీన శత్రువుల కోసం ప్రార్ధించుదాం . వాళ్ల మనసును గాయపరచన పొరపాటు మనదే కదా! కాబట్టి క్షమాపణ అడుగుదాం! ప్రభువు సంతోషిస్తారు.