పవిత్ర వస్తువులను దొంగలించిన దుండగులు

జోసెఫ్ అవినాష్
25 Mar 2025
మార్చి 21 రాత్రి బలంగీర్ జిల్లాలోని టిటిలఘర్‌లోని తిరుకుటుంబ దేవాలయాన్ని దుండగులు తెరిచి పవిత్ర వస్తువులను, చందా పెట్టెను ఎత్తుకు వెళ్లారు. అంతటితో ఊరుకోకుండా స్వరూపాన్ని ధ్వంసం చేశారని మార్చి 22న అక్కడి స్థానిక పీఠ కాపరి నిరంజన్ సువాల్సింగ్ మీడియాకు వివరించారు. జరిగిన ఘటనపై దేవాలయ విచారణ గురువు ఫాదర్ జోసెఫ్ ఆంటోనీ పోలీసులకు ఫిర్యాదు చేశారని పీఠాధిపతి తెలియపరిచారు. దొంగలు దేవాలయాన్ని అపవిత్ర పరిచారని ప్రతి ఒక్కరూ ప్రార్థించాలని ఆయన విశ్వాసులను కోరారు. ఈ దుఃఖ సమయంలో ప్రతి ఒక్కరు సంఘీభావంలో ఐక్యంగా నిలబడాలని ఆయన కోరారు. ఈ విషయాన్ని ప్రభువు చేతులకు అప్పగించి ప్రార్థించాలని, అదేవిధంగా దొంగల బారి నుండి పవిత్ర స్థలాలను సంరక్షించుకునే బాధ్యత మనందరిపై ఉందని ఆయన ఆవేదన వ్యక్తపరిచారు.